అమీర్‌పేట మెట్రో స్టేషను
అమీర్‌పేట మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | సంజీవరెడ్డి నగర్ రోడ్డు, అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ రోడ్డు సమీపంలో, మైత్రివనం, హైదరాబాదు-500016, భారతదేశం |
Coordinates | 17°26′05″N 78°26′53″E / 17.434802°N 78.448011°E |
పట్టాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైన |
Depth | 7.07 మీటర్లు |
Platform levels | 2 |
History | |
Opened | నవంబరు 29, 2017 |
అమీర్‌పేట మెట్రో స్టేషను, హైదరాబాదులోని అమీర్‌పేట ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన ఎరుపురంగు లైను, నీలిరంగు లైనుల మధ్య అంతరమార్పు ఉన్న మెట్రో స్టేషను ఇది.[1][2] 2,00,000 చదరపు అడుగులు (19,000 చదరపు మీటర్లు) ఉన్న అమీర్‌పేట ఇంటర్-చేంజ్ మెట్రో స్టేషను, భారతదేశంలోని అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటి.[3] హైదరాబాద్ఉలోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటైన ఈ అమీర్‌పేట మెట్రో స్టేషనులో, ప్రతిరోజూ సుమారు 32,000 మంది ప్రయాణం చేస్తున్నారు.[4][5]
చరిత్ర
[మార్చు]2017, నవంబరు 29న ఈ స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
[మార్చు]సౌకర్యాలు
[మార్చు]అమీర్‌పేట మెట్రో స్టేషను అతి రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రం. ఇక్కడ దుస్తులు, బిర్యానీ, షావర్మా, తేనీరు మొదలైనవి విక్రయించే అనేక దుకాణాలు ఉన్నాయి.[6] పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సౌకర్యం కూడా ఉంది.[7]
స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[8]
స్టేషను లేఔట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[9]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[9]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[9]
ప్రమాదాలు
[మార్చు]2019, సెప్టెంబరు 22న మౌనికా అనే 27 ఏళ్ళ మహిళ వర్షం సమయంలో అమీర్‌పేట మెట్రో స్టేషనుకు చెందిన ఎ-1053 స్తంభం కిందికి వచ్చింది.[10] ఆ స్తంభానికి చెందిన కాంక్రీట్ స్లాబ్[11] 9 మీటర్ల ఎత్తు నుండి ఆమె తలపై పడింది. ఆమెను అమీర్‌పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ మరణించింది.[12][13][14] హైదరాబాదు మెట్రో సంస్థ పరిహారంగా బాధితురాలి కుటుంబానికి 20 లక్షల రూపాయలు చెల్లించింది.[15] బీమా సంస్థ నుండి మరో రూ .15 లక్షలు, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇస్తామని ఎల్ అండ్ టి తెలిపింది.[16] ఐపీసీ సెక్షన్ 304-ఎ (నిర్లక్ష్యం మరణానికి కారణమవుతుంది) కింద ఎల్ అండ్ టిపై కేసు నమోదైంది.[17] ఈ సంఘటన జరిగిన ఒక రోజు తరువాత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కె.టి.రామారావు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని హైదరాబాదు మెట్రో రైల్ అధికారులను ఆదేశించాడు.[18] ఇటువంటి సంఘటన మళ్లీ జరగకుండా అన్ని నిర్మాణాలను, సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నాడు.[19]
మూలాలు
[మార్చు]- ↑ "Ameerpet metro station gets e-bikes, eateries". Thehindu.com. Retrieved 2020-12-09.
- ↑ "station detail". Retrieved 2020-12-09.
- ↑ "Via the largest Metro station in the country". Economictimes.indiatimes.com. Retrieved 2020-12-09.
- ↑ "Hyderabad Metro sees record 4.6 lakh passengers on New Year's Eve". Retrieved 2020-12-09.
- ↑ "Hyderabad Metro breaks record with 2.55 lakh footfall". Retrieved 2020-12-09.
- ↑ "Romancing the city in metro". Archived from the original on 2019-10-22. Retrieved 2020-12-09.
- ↑ "Watch videos with free Wi-Fi at Hyderabad metro". Deccanchronicle.com. Retrieved 2020-12-09.
- ↑ https://www.ltmetro.com/metro-stations/
- ↑ 9.0 9.1 9.2 "Platform level". Hyderabad Metro Rail.
- ↑ "Woman dies as Metro wall peels off, falls on her". Retrieved 2020-12-09.
- ↑ "Shouldn't have asked her to take Metro, says husband of Hyderabad freak accident victim". Retrieved 2020-12-09.
- ↑ "Woman dies after concrete of Hyderabad Metro rail falls on her". Retrieved 2020-12-09.
- ↑ "Hyderabad: 27-year-old woman dies after concrete chunks at Metro station fall on her". The Indian Express. September 22, 2019. Retrieved 2020-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hyderabad: Metro commuters fear for their safety". The Times of India. 2019-09-23. Retrieved 2020-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Woman killed in Hyd station: Rs 20 lakh for Mounika's life". Retrieved 2020-12-09.
- ↑ "Probe begins after woman killed at Hyderabad Metro station". Retrieved 2020-12-09.
- ↑ "L&T booked for death at Ameerpet Metro station". Retrieved 2020-12-09.
- ↑ "Shoddy maintenance bares safety chinks in Hyderabad metro project". Retrieved 2020-12-09.
- ↑ "Womans death raises questions on Hyderabad Metro quality". Retrieved 2020-12-09.
ఇతర లంకెలు
[మార్చు]- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.