Jump to content

ది పబ్లిక్ ఎనిమీ (1931 సినిమా)

వికీపీడియా నుండి
ది పబ్లిక్ ఎనిమీ
ది పబ్లిక్ ఎనిమీ సినిమా పోస్టర్
దర్శకత్వంవిలియం వెల్‌మన్
రచనజాన్ బ్రైట్, క్యూబెక్ గ్లాస్మోన్
స్క్రీన్ ప్లేహార్వే ఎఫ్. థే[1]
నిర్మాతడారైల్ ఎఫ్. జనక్
తారాగణంజేమ్స్ కేనీ, జీన్ హార్లో ఎడ్వర్డ్ వుడ్స్, జోన్ బ్లాండెల్
ఛాయాగ్రహణందేవరెక్స్ జెన్నింగ్స్
కూర్పుఎడ్వర్డ్ మైఖేల్ మెక్డెర్మాట్
నిర్మాణ
సంస్థ
వార్నర్ బ్రదర్స్
పంపిణీదార్లువార్నర్ బ్రదర్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 23, 1931 (1931-04-23)
సినిమా నిడివి
83 నిముషాలు[2][3]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$151,000[4]
బాక్సాఫీసు$557,000[5]

ది పబ్లిక్ ఎనిమీ 1931, ఏప్రిల్ 23న విడుదలైన అమెరికా క్రైమ్ సినిమా. వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో విలియం వెల్‌మన్ దర్శకత్వంలో జేమ్స్ కేనీ, జీన్ హార్లో ఎడ్వర్డ్ వుడ్స్, జోన్ బ్లాండెల్ తదితరులు నటించిన ఈ చిత్రం మరెన్నో క్రైమ్ చిత్రాలకు మోడల్ గా నిలిచింది.[6]

చికాగో (అమెరికా) నగరంలోని మురికివాడల్లో పెరిగిన ఐరీష్ కు చెందిన టామ్ పవర్స్ (జేమ్స్ కేనీ), మాట్ డోయల్ (ఎడ్వర్డ్ వుడ్స్) ఇద్దరు ఒక దుకాణంలో దొంగతనం చేస్తారు. పియానో ప్లేయర్ పుట్టినోస్ వాళ్ళిద్దరికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి గన్స్ ఇస్తాడు. వాటితో మొదటగా ఒక పోలీసును చంపుతారు. అలా వారు అనేక నేరాలకు పాల్పడతూ, మిగతా గ్యాంగ్‌లను మించిపోతారు. అది సహించని గ్యాంగ్‌స్టర్స్ టామ్, మాట్ లపై దాడికి దిగుతారు, వారితో జరిగిన పోరాటంలో వాళ్ళిద్దరు మరణిస్తారు.

నటవర్గం

[మార్చు]
  • జేమ్స్ కేనీ
  • జీన్ హార్లో ఎడ్వర్డ్ వుడ్స్
  • జోన్ బ్లాండెల్
  • బెరిల్ మెర్సెర్
  • డోనాల్డ్ కుక్
  • మే క్లార్క్
  • లెస్లీ ఫెంటన్
  • రాబర్ట్ ఎమ్మెట్ ఓ'కోనర్
  • ముర్రే కిన్నెల్
  • ఫ్రాంక్ కోగ్లన్ జూనియర్
  • ఫ్రాంకీ డార్రో
  • రాబర్ట్ హోమ్స్
  • సామ్ మక్ డానియల్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విలియం వెల్‌మన్
  • నిర్మాత: డారైల్ ఎఫ్. జనక్
  • రచన: జాన్ బ్రైట్, క్యూబెక్ గ్లాస్మోన్
  • స్క్రీన్ ప్లే: హార్వే ఎఫ్. థే
  • ఆధారం: జాన్ బ్రైట్, క్యూబెక్ గ్లాస్మోన్ రాసిన బీర్, బ్లడ్ నవల
  • ఛాయాగ్రహణం: దేవరెక్స్ జెన్నింగ్స్
  • కూర్పు: ఎడ్వర్డ్ మైఖేల్ మెక్డెర్మాట్
  • నిర్మాణ సంస్థ, పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్

చిత్ర విశేషాలు

[మార్చు]
  1. ఈ చిత్రం స్ఫూర్తితో అనేక క్రైమ్ చిత్రాలు రావడంతో అమెరికాలోని క్రైస్తవ మత సంస్థలు నిరసలను చేశాయి. దాంతో కథలను మార్చి విజయమెప్పుడూ చట్టానిదేనన్న నేపథ్యంలో సినిమాలు తీశారు.[6]
  2. ఈ చిత్రంలో అనేక హత్యలు ఉన్నా తెరమీర మాత్రం ప్రేక్షకులకు ఒక హత్యనే కనిపిస్తుంది. మిగతా హత్యలు జరుగుతున్నప్పుడు చీకట్లని చూపించడం, తుపాకీ గొట్టాలనుండి వచ్చే కాల్పుల మెరుపుల కనిపించడం,శబ్ధాలు వినిపించడం వంటివి ఉపయోగించడం జరిగింది.[7]
  3. టామ్, అతని ప్రియురాలు మధ్య జరిగే సన్నివేశంలో టేబుల్ మీద ఉన్న బౌల్ తో ఆమె చెంపమీద కొడుతాడు. అది హాలీవుడ్ సినీరంగంలో నేటివరకు కూడా మరిచిపోలేని విధంగా ఉంటుంది.[7]

నిర్మాణం

[మార్చు]

1931 జనవరి, ఫిబ్రవరి నెలల్లో $ 151,000తో ఈ చిత్రం తీయబడింది.[8] $557,000ను వసూలు చేసింది.[5]

గుర్తింపులు

[మార్చు]

2008లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారి అమెరికన్ చలన చిత్రాలలో ఉత్తమ పది క్లాస్ చిత్రాలు విభాగంలో టాప్ 10 జాబితాలలో ఒకటిగా నిలిచింది. గ్యాంగ్‌స్టర్స్ జానర్ విభాగంలో ఎనమిదవ చిత్రంగా నిలిచింది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Credits: The Public Enemy". BFI Film & TV Database. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 11 February 2019. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. Sennwald, Andre (April 24, 1931). "The Public Enemy". The New York Times. Retrieved 11 February 2019.
  3. "Release: The Public Enemy". BFI Film & TV Database. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 11 February 2019. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. Dirks, Tim (2006). "The Public Enemy (1931)". The Greatest Films. filmsite.org. Retrieved 11 February 2019.
  5. 5.0 5.1 Warner Bros financial information in The William Shaefer Ledger. See Appendix 1, Historical Journal of Film, Radio and Television, (1995) 15:sup1, 1-31 p 11 DOI: 10.1080/01439689508604551
  6. 6.0 6.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 18.
  7. 7.0 7.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 19.
  8. "Business Data for The Public Enemy (1931)". IMDb. Retrieved 11 February 2019.
  9. "AFI's 10 Top 10". American Film Institute. 2008-06-17. Retrieved 11 February 2019.

ఇతర లంకెలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]