బైట్ కోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి-కోడ్ (పోర్టెబుల్ కోడ్) గా కూడా వ్యవహరించబడే బైట్ కోడ్ ఇటు మనిషికి అర్ధంకాని, అటు కంప్యూటర్కూ అర్ధంకాని విధంగా మధ్యస్థంగా ఉండే భాషలో రాయబడి ఉంటుంది. బైట్ కోడ్ ఇంటర్ప్రెటర్ ద్వారా ఇందులో చొప్పించబడిన ఆజ్ఞలను కంప్యూటర్ కు సూచించవచ్చు. కంప్యూటర్ కేవలం 0-1 అంకెలలో ఉన్న విషయాలనే అర్ధం చేసుకోగలదు. కానీ మనిషి రాసే ఏ కోడ్ కూడా నేరుగా 0-1 లుగా మారదు. మధ్యలో ఎన్నో సాఫ్టువేరు ప్రోగ్రాములు మనిషి కోడ్ ద్వారా రాసిన ఆజ్ఞలను సరియయిన పద్ధతిలో మర్చుతూ 0-1 లలోకి వచ్చేలా చేస్తాయి. అలా మధ్యవర్తి ప్రోగ్రాములను తగ్గించి, రెండు సోపానాలలో ఆజ్ఞలు కంప్యూటరుకు చేరేలా చేసేందుకు రూపొందించబడిందే ఈ బైట్ కోడ్. ఇందులో అంకెల సంజ్ఞల రూపంలో వివిధ గణితాంశాలు, స్థిరాంశాలు, చరాంశాలు, చర రాశులు, స్థిర రాశులు, ఇతర ప్రోగ్రాము సంబంధిత దత్తాంశాలు మొదలగునవి ఉంటాయి. అందువలన సోర్స్ కోడ్ ను నేరుగా కంప్యూటరుకి అర్ధమయ్యేట్టు చేసే బదులు బైట్ కోడ్ ను వాడటం మరింత ఉపయోగకరం. బైట్ కొడ్ అనగా, సొఫ్ట్ వెర్ ఇంటెర్ ప్రెటర్ చె అమలు చెయుబడుటకు నిర్మించిన ఆధెసాల పటిక్క బైట్ కోడ్ అనే పదం రెండు పదాల నుండి వస్తుంది - బైట్, కోడ్. బైట్ అంటే కంప్యూటర్ భాషలో ఒక కొలమానం. 0 లేదా 1 ఒక బిట్ అవుతాయి. అలా ఎనిమిది బిట్ ల కలయికతో ఒక అంకెను/అక్షరాన్ని చెప్పవచ్చు. ఉదాహరణకి 0/1 లలో మాత్రమే 2 ను సూచించాల్సి వచ్చినపుడు 10 గా చూపిస్తాము. ఇది ఎలా అంటే కేవలం 1 వేలు ఉన్న మనిషి ఉంటే అతనికి అంకెలు లెక్కపెట్టేందుకు 0 ఇంకా 1 మాత్రమే.