మైక్రోసాఫ్ట్ ఎడ్జ్
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ | |
---|---|
మూలకర్త | మైక్రోసాఫ్ట్ |
అభివృద్ధిచేసినవారు | మైక్రోసాఫ్ట్ |
మొదటి విడుదల | జూలై 29, 2015 |
నిర్వహణ వ్యవస్థ | ఐఓఎస్, ఆండ్రాయిడ్, Xbox One System Software, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, macOS |
లైసెన్సు | Proprietary software;[1] a component of Windows 10 |
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది మైక్రోసాఫ్ట్ వారిచే అభివృద్ది చేయబడిన జాల విహారిణి. ఇది మొదటగా విండోస్ 10, ఎక్స్బాక్స్ వన్ కోసం 2015 లో విడుదల చేయబడినది. 2017 లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు, 2019 లో మాక్ ఓఎస్ లకు విడుదల చేశారు.ఇది మొదట స్వంత ఉత్పత్తిగా చేసినప్పటికీ ఆదరణ లేకపోవడం తో ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్ అయిన క్రోమియం ఆధారితం గా మళ్ళీ అభివృద్ది చేశారు. జనవరి 15 2020 న సాధారణ వినియోగదారుల కోసం విడుదల చేశారు. ఇది కూడా గూగుల్ క్రోమ్ లాగా తనంతట తానుగా విండోస్ అప్డేట్ తో సంబంధం లేకుండా నవీకరించబడుతుంది. విండోస్ 10 యొక్క 2004 ఫీచర్ నవీకరణ ద్వారా సాధారణ వినియోగదారులకు అందించబడుతుందని భావిస్తున్నారు. కావాలనుకున్న వారు వారి జాల స్థలము నుండి దింపుకొనవచ్చును.[2] జాల స్థలము లంకె https://www.microsoft.com/en-us/edge.
ఇది మైక్రోసాఫ్ట్ కార్టనా కి అనుసంధానించబడినది. మైక్రోసాఫ్ట్ స్టోర్ లోని పొడిగింపులను ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ విహారిణి కొరకు వ్యవస్థాపితం చేసుకొనవచ్చును.
మార్కెట్ వాటా
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]ప్రస్తావనలు
[మార్చు]- ↑ Novet, Jordan (మే 5, 2015). "Microsoft says it has no plans to open-source its new Edge browser … yet". VentureBeat. Archived from the original on సెప్టెంబరు 22, 2017.
- ↑ https://www.microsoft.com/en-us/edge
- ↑ "Desktop Browser Market Share Worldwide". StatCounter Global Stats (in ఇంగ్లీష్). Retrieved 17 January 2020.