Jump to content

రోసా పార్క్స్

వికీపీడియా నుండి
రోసా పార్క్స్
రోసా పార్క్స్ 1955 లో, వెనుకనున్నది మార్టిన్ లూథర్ కింగ్, జూ
జననం
రోసా లూయిస్ మెక్కాలీ

(1913-02-04)1913 ఫిబ్రవరి 4
తుస్కీజీ, అలబమ, యు.ఎస్.
మరణం2005 అక్టోబరు 24(2005-10-24) (వయసు 92)
డిట్రాఇట్, మిచిగాన్, యు.ఎస్.
జాతీయతఅమెరికన్
వృత్తిపౌర హక్కుల ఉద్యమకారి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మాంట్గోమెరి బస్ బహిష్కరణ
జీవిత భాగస్వామిరేమండ్ పార్క్స్ (1932–1977)
సంతకం
పార్క్స్, యు.ఎస్. అధ్యక్షుడు బిల్ క్లింటన్

రోసా లూయిస్ మెక్కాలీ పార్క్స్ (1913 ఫిబ్రవరి 4 - 2005 అక్టోబరు 24) ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి. ఈమెను "ఆధునిక అమెరికన్ పౌర హక్కుల ఉద్యమం యొక్క తల్లి" అని పిలుస్తారు. 1955 డిసెంబరు 1 లో ఆమె సొంత పట్టణం మోంట్గోమెరీ, అలబమలో ఆమె చేసిన పని వలన పార్క్స్ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆమె ఒక బస్సు యొక్క ముందు సీటులో కూర్చొనింది, ముందు సీట్లు తెల్ల ప్రయాణీకులు పొందేవి కాబట్టి బస్సు డ్రైవర్ ఆమెను బస్సులో వెనుకకు వెళ్ళమని చెప్పారు. పార్క్స్ వెనుకకు వెళ్లేందుకు నిరాకరించింది. ఎందుకంటే ఆమె చర్మం రంగు యొక్క కారణంగా ఒక దిగువ తరగతి వ్యక్తిగా పొందిన ప్రవర్తనలకు విసిగిపోయి ఉంది. ఈమె అరెస్టు చేయబడింది. ఇది మాంట్గోమెర్రి బస్సు బహిష్కరణకు దారితీసింది. ఆ తరువాత, నల్లజాతి వారు బస్సులో వారు కోరుకున్న చోట కూర్చునేందుకు అవకాశమేర్పడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆఫ్రికా-అమెరికా చట్ట హక్కుల ఉద్యమం (1955-1968)