లింకన్ మెమోరియల్
Appearance
లింకన్ మెమోరియల్ (Lincoln Memorial), అమెరికా దేశపు జాతీయ స్మృతి చిహ్నం. దీనిని అమెరికా 16వ రాష్ట్రపతి అబ్రహం లింకన్ జ్ఞాపకార్ధం నిర్మించారు. ఇది వాషింగ్టన్ డి.సి.లోని జాతీయ మాల్ ప్రాంతంలో ఉంది. దీని శిల్పి హెంరీ బేకన్.
ప్రతిరోజు సుమారు 6 మిలియన్ ప్రజలు ఈ మెమోరియల్ ను తిలకిస్తారు.[1] 2007 అంచనాల ప్రకారం, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఇది ఏడవ స్థానాన్ని ఆక్రమించింది.[2] దీనిని ప్రజల దర్శనార్ధం రోజూ 24 గంటలు తెరచి ఉంచుతారు.
యు.యస్. కరెన్సీ మీద మెమోరియల్ ప్రతిమ
[మార్చు]1959 నుండి 2008 వరకు, లింకన్ మెమోరియల్ ను ఒక సెంటు నాణెం మీద లింకన్ ముఖచిత్రంతో కలిపి ముద్రించారు. దీనిని లింకన్ యొక్క 150వ వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు.ఈ మెమోరియల్ అమెరికా దేశపు 5-డాలర్ల నోటు మీద చిత్రపటంతో పాటు చూపించారు.
మూలాలు
[మార్చు]- ↑ http://www.nature.nps.gov/stats/viewReport.cfm Archived 2015-05-03 at the Wayback Machine Annual Park Visitation Report for Lincoln Memorial data for 2010
- ↑ "America's Favorite Architecture". American Institute of Architects. 2007. Archived from the original on 2007-07-15. Retrieved 2009-11-03.