శివలెంక కృష్ణప్రసాద్
శివలెంక కృష్ణప్రసాద్ | |
---|---|
జననం | 1956 అక్టోబరు 24 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సినిమా నిర్మాత, పంపిణీదారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1984 - ప్రస్తుతం |
పిల్లలు | 2 |
బంధువులు | చంద్రమోహన్ (మేనమామ) |
శివలెంక కృష్ణప్రసాద్ (జననం 1956 అక్టోబరు 24) ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. మూడు దశాబ్దాలకు పైగా సినిమా పంపిణీదారుడు కూడా. సమంత ప్రధాన పాత్రధారిగా 2022లో యశోద చిత్రం నిర్మించాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రూపోందించారు.[1]
విద్యాభ్యాసం
[మార్చు]శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు ప్రసిద్ధ నటుడు చంద్రమోహన్ మేనల్లుడు. అతను ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు.
కెరీర్
[మార్చు]ఆయన కన్నడ సినిమా జిడ్డిని రాకాసి నాగు (1984)గా తెలుగులోకి డబ్బింగ్ చేసి తన వృత్తిని ప్రారంభించాడు. శ్రీదేవి మూవీస్, వైష్ణవి సినిమా, శ్రీదేవి మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి సంస్థలు స్థాపించి మరెన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.
ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో జీవితకాల సభ్యుడు. 2006 నుండి ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(SIFCC), తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో కూడా సభ్యుడు కావడం విశేషం.
సీరియల్ నిర్మాతగా
[మార్చు]2012లో శ్రీదేవి మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ను స్థాపించాడు. ఈ బ్యానర్‌లో ఈటీవీ నెట్‌వర్క్ అయిన ఈటీవీ ఛానెల్ తెలుగులో ముత్యమంత పసుపు అనే టీవీ సీరియల్‌ని నిర్మించి 250 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేశాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]నిర్మాతగా
[మార్చు]డబ్బింగ్ సినిమాలు
[మార్చు]1985 | ఎదురుదాడి (రక్త తిలక) |
1992 | అభిమన్యు (అభిమన్యు) |
1992 | యోద్ధ (యోద్ధ) |
1992 | అశోకన్ (యోద్ధ) |
1992 | ధర్మ యోద్ధ (యోద్ధ) |
1993 | గంధర్వం (గంధర్వం) |
1994 | ప్రిన్స్ (ప్రిన్స్) |
1996 | నాన్ ఉంగ వీటు పిళ్లై (వంశానికొక్కడు) |
2000 | VIP - తెలుగు VIP |
2005 | మన్మధ (మన్మధన్) |
అసోసియేట్ ప్రొడ్యూసర్ గా
[మార్చు]1994 | గుణ (తెలుగు వెర్షన్) |
1995 | శుభ సంకల్పం |
1996 | హలో బ్రదర్ (తమిళ వెర్షన్) |
1997 | భామనే సత్యభామనే (అవ్వై షణ్ముఖి తెలుగు వెర్షన్) |
2000 | తెనాలి |
2005 | మజ్హై |
2018 | బ్లఫ్ మాస్టర్ (2018 చిత్రం) |
2020 | ఎంత మంచివాడవురా |
లైన్ ప్రొడ్యూసర్ గా
[మార్చు]2003 | ఉన్నై చరనదైందేన్ |
2006 | చెన్నై 600028 |
2009 | కుంగుమ పూవుం కొంజుం పూరవుం |
డిస్ట్రిబ్యూటర్‌గా
[మార్చు]- రాకాసి నాగు
- తులసీ దళం
- రక్షకుడు
- పోలీస్ స్టోరీ : ఫస్ట్ స్ట్రైక్
- మిస్టర్ నైస్ గై (1997 చిత్రం)
- హుం యామ్ ఐ?
- ది యాక్సిడెంటల్ స్పై
మూలాలు
[మార్చు]- ↑ "Yashoda: ప్రేక్షకుడు కోరుకునేది కథే". web.archive.org. 2022-11-14. Archived from the original on 2022-11-14. Retrieved 2022-11-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sivalenka Krishna Prasad ( Aditya 369 Movie 25 Years )". maastars.com.
- ↑ "Sivalenka Krishna Prasad again with Balakrishna". indiaglitz.com.
- ↑ "A comeback after eight years for Sivalenka Krishna Prasad". deccanchronical.com.