అజ్ఞాతవాసి
అజ్ఞాతవాసి | |
---|---|
దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
నిర్మాత | ఎస్. రాధాకృష్ణ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వి. మణికండన్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థ | హారిక & హాసినీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 10 జనవరి 2018 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అజ్ఞాతవాసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 2018లో విడుదలైన సినిమా. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు.[1]
కథ
[మార్చు]హీరో తన తండ్రిని చంపిన వారిని తెలుసుకోటానికి తన సొంత కంపెనీలో ఉద్యోగిగా వస్తాడు. వాళ్ళని కనుగొని చంపటమే ఈ సినిమా కథ.
తారాగణం
[మార్చు]పవన్ కల్యాణ్ ఇందులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిగా కనిపిస్తాడు. అతనికి మరదలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.
- అభిషిక్త్ భార్గవ్ / బాలసుబ్రమణ్యంగా పవన్ కళ్యాణ్
- సుకుమారిగా కీర్తీ సురేష్
- సుర్యకాంతంగా అనూ_ఇమాన్యుల్
- ఇంద్రాని భార్గవ్‌గా కుష్బూ
- సీతారాంగా ఆది పినిశెట్టి
- గొవింద భార్గవ్ లేదా విందాగా బొమన్ ఇరాని
- అప్పాజిగా తనికెళ్ళ భరణి
- వర్మగా రావు రమేశ్
- శర్మగా మురళీ శర్మ
- ఏ.సి.పి.గా సంపత్ రాజ్
- క్రిష్నవేని భార్గవ్‌గా ఇంద్రజా
- బాల సుబ్రమణ్యంగా వెన్నెల కిశోర్
- ఆదిత్య బండారుగా అజయ్
- దీనబంధుగా సమీర్
- ఆదిత్య బండారు సొదరుడుగా జయప్రకాష్
- కోటెశ్వర రావుగా రఘు బాబు
- రాకిశ - జయ బదలాని
- శ్రీకాంత్ అయ్యంగర్
సంగీతం
[మార్చు]అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఆడియో డిసెంబరు 19, 2017 న విడుదలైంది.
[2]బయటికొచ్చి చూస్తే, రచన: శ్రీమణి, గానం. అనిరుద్ రవిచందర్
గాలి వాలుగా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.అనిరుద్ రవిచందర్
ధగ ధగ మనే , రచన: శ్రీమణి, గానం . అనిరుద్ రవిచందర్
కొడకా కోటేశ్వర రావు, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. పవన్ కళ్యాణ్
ఎ బి ఎవరో నీ బేబీ , రచన: శ్రీమణి , గానం.నకాష అజీజ్, అర్జున్ చండీ
స్వాగతం కృష్ణా ,: రచన: ఊత్తుక్కడు శ్రీ వెంకట సుబ్బ ఐయేర్ కృతి , గానం.పద్మలతా , నిరంజన, రమణన్.
రికార్డులు
[మార్చు]యూనివర్సల్ స్టూడియోస్ లోని సిటీ వాక్ థియేటర్స్ లో ప్రదర్శించబడిన తొలి భారతీయ చిత్రంగా ఈ చిత్రం రికార్డును సృష్టించినది. [3]
వివాదాలు
[మార్చు]ఈ చిత్రం ఫ్రెంచి సినిమా లార్గో వించ్ నుండి కాపీ కొట్టబడినదని, అయితే ఫ్రెంచి సినిమా యొక్క నకలు హక్కులు T-Series సంస్థ అప్పటికే పొంది ఉన్నదని, ఈ చిత్రానికి చట్టపరమైన ఇబ్బందులు తప్పవని పుకార్లు షికార్లు చేసాయి. [4]
మూలాలు
[మార్చు]- ↑ న్యాయపతి, నీషిత. "Pawan Kalyan's clip from behind-the-scenes of 'Agnathavasi' goes viral". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 26 December 2017.
- ↑ "Live: Agnyaathavaasi audio launch". thehansindia.com. Retrieved 26 December 2017.
- ↑ యూనివర్సల్ స్టూడియోస్ లోని సిటీ వాక్ థియేటర్స్ లో ప్రదర్శించబడిన తొలి భారతీయ చిత్రం[permanent dead link]
- ↑ https://www.deccanchronicle.com/entertainment/tollywood/010118/agnyaathavaasi-lands-in-trouble.html