Jump to content

తిరువిళ జయశంకర్

వికీపీడియా నుండి
తిరువిళ జయశంకర్
తిరువిళ జయశంకర్
వ్యక్తిగత సమాచారం
జననం (1940-02-01) 1940 ఫిబ్రవరి 1 (వయసు 84)
తిరువిళ, అలెప్పి, కేరళ, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తినాదస్వర విద్వాంసుడు
వాయిద్యాలునాదస్వరం
క్రియాశీల కాలం1955–ప్రస్తుతం

తిరువిళ జయశంకర్ కేరళ కు చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు, నాదస్వర విద్వాంసుడు/[1]

ఆరంభ జీవితం, విద్య

[మార్చు]

ఇతడు కేరళ రాష్ట్రం, అలప్పుళ జిల్లా, తిరువిళ అనే కుగ్రామంలో సంగీతకారుల కుటుంబంలొ 1940, ఫిబ్రవరి 1వ తేదీన జన్మించాడు. ఇతనికి చిన్నతనం నుండి సంగీతం అన్నా, చిత్రలేఖనం అన్నా ఆసక్తి ఉండేది. ఇతని తాత తిరువిళ శంకు పణికర్, తండ్రి తిరువిళ రాఘవ పణికర్ ఇద్దరూ నాదస్వర విద్వాంసులే. ఇతడు మొదట తన తాత వద్ద ప్రాథమికంగా సంగీతం నేర్చుకుని, తరువాత తండ్రి వద్ద మెరుగైన శిక్షణ తీసుకున్నాడు. ఇతడు తన తండ్రితో కలిసి తిరువాంకూర్ దేవాలయాలలో క్రమం తప్పకుండా కచేరీలు చేయడం మొదలు పెట్టాడు. ఇతని తొలి కచేరీ తన 16వ యేట 1955లో కాయంకుళంలోని పతియూర్ దేవి ఆలయంలో జరిగింది.[2]

1957లో ఇతడు కేరళ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్.ఎల్.వి. సంగీత & లలిత కళల కళాశాలలో సంగీతంలో "గానభూషణం" (డిప్లొమా)ను పూర్తి చేశాడు. అక్కడ నేపథ్య గాయకుడు కె. జె. ఏసుదాసు ఇతని సహాధ్యాయి. డిప్లొమా తరువాత ఇతడు కొచ్చిన్ విశ్వవిద్యాలయం, పాలక్కాడు సమీపంలోని చిత్తూరు ప్రభుత్వ సంగీత కళాశాలలో బి.ఎ. (సంగీతం) చదివాడు. తరువాత త్రివేండ్రంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో "గాన ప్రవీణ" (పి.జి.డిప్లొమా) చదివాడు.[3]

వృత్తి

[మార్చు]

ఇతడు 1965లో ఆకాశవాణి తిరువనంతపురం కేంద్రంలో ఉద్యోగంలో చేరి పదవీ విరమణ వరకూ అక్కడే పనిచేశాడు. ఇతడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

ఇతడు డోలు కళాకారుడు వాయల్పట్టి సుబ్రహ్మణ్యంతో కలిసి అనేక నాదస్వర కచేరీలు చేశాడు. ఇతని అనేక మంది శిష్యులలో హరిపాద మురగదాస్, వెట్టిక్కవల శశికుమార్ మొదలైన వారు చెప్పుకోదగిన వారు.[4][5]

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.thehindu.com/features/friday-review/music/sound-of-the-nagaswaram/article5451620.ece
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-10. Retrieved 2021-03-21.
  3. http://www.thehindu.com/news/cities/Kochi/its-not-possible-to-mould-artistes-focussing-on-theory/article4476031.ece
  4. Kaladharan, V. (12 December 2013). "Sound of the nagaswaram". The Hindu. Retrieved 2014-02-01.
  5. Kaladharan, V. (20 December 2013). "Inimitable idiom". The Hindu. Retrieved 2014-02-01.
  6. http://prominentindianpersonalities.blogspot.in/2012/05/thiruvizha-jayasankar.html
  7. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2014-04-29. Retrieved 2021-03-21.{{cite web}}: CS1 maint: archived copy as title (link)