Jump to content

సింధీ భాష

వికీపీడియా నుండి
సింధీ
سنڌي / सिन्धी / / ਸਿੰਧੀ
మాట్లాడే దేశాలు: సింధ్ 
ప్రాంతం: దక్షిణ ఆసియా
మాట్లాడేవారి సంఖ్య: 2 కోట్ల 50 లక్షల మంది
భాషా కుటుంబము:
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   వాయువ్య భాషలు
    సింధీ భాషలు
     సింధీ 
వ్రాసే పద్ధతి: పర్షియో-అరబిక్ లిపి, దేవనాగరి లిపి, ఖుబబది లిపి, లండా లిపి, గురుముఖీ లిపి[1] 
అధికారిక స్థాయి
అధికార భాష:  Pakistan (సింధ్)[2][3][4]
 India
నియంత్రణ: సింధీ లాంగ్వేజ్ అధారిటీ (పాకిస్తాన్),
నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సింధీ లాంగ్వేజ్ (భారతదేశం)
భాషా సంజ్ఞలు
ISO 639-1: sd
ISO 639-2: snd
ISO 639-3: snd

సింధీ /ˈsɪndi/[5] (سنڌي, सिन्धी, , ਸਿੰਧੀ) చారిత్రకంగా సింధ్ ప్రాంతంలో, సింధీ ప్రజలు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సుకు ఇది అధికారిక భాష.[6][7][8] భారత దేశంలో ఏ రాష్ట్రానికి సింధీ భాష అధికారిక భాషగా లేదు, కానీ భారత ప్రభుత్వం గుర్తించిన షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి.[9][10]

సింధీ భాష మాట్లాడేవారిలో ఎక్కువశాతం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సులోనూ, భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలోనూ, మహారాష్ట్రలోని ఉల్‌హాస్ నగర్ ప్రాంతంలోనూ ఉన్నారు. మిగిలిన సింధీ భాషీయుల్లో భారతదేశ విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వలసవచ్చి స్థిరపడ్డ సింధీ హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింధీ డయాస్పోరా ప్రజలు ఉన్నారు. ఈ క్రమంలో పైన ప్రస్తావించిన ప్రాంతాలు మాత్రమే కాక పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సులు, భారతదేశంలోని రాజస్థాన్, పంజాబ్, సింధీలు వలసవెళ్ళిన హాంగ్‌కాంగ్, ఒమన్, ఇండోనేషియా, సింగపూరు, యుఎఇ, రష్య, యుకె, అమెరికా వంటి దేశాల్లోనూ సింధీ మాట్లాడతారు.[11]

చరిత్ర

[మార్చు]
ఖుడబడి లిపిలోని డోడో చన్సర్ ఇతిహాసపు కవర్ పేజీ

ఇండో-ఆర్యన్ భాషాకుటుంబంలోని ఇతర భాషల్లానే, సింధీ కూడా ప్రాచీన ఇండో-ఆర్యన్ (సంస్కృతం), మధ్య ఇండో-ఆర్యన్ (పాళి, మధ్యమ ప్రాకృత భాషలు, అపభ్రంశ రూపాలు) దశలు దాటుకుని సా.శ.10వ శతాబ్దిలో కొత్త ఇండో-ఆర్యన్ దశలోకి చేరుకుంది.[12][13] 15వ శతాబ్ది నుంచి రాతలో విస్తారంగా సింధీ భాష లభిస్తోంది. మధ్యయుగాల నాటి సింధీ ఆధ్యాత్మిక సాహిత్యం (1500-1843)లో సూఫీ కవిత్వం, అద్వైత వేదాంత కవిత్వం ఉండేవి. 1843 నుంచి ఆధునిక యుగంగా సింధీ సాహిత్య వేత్తలు భావిస్తారు. ఆధునిక యుగంలో పలు విధాల సాహిత్యప్రక్రియల్లో సింధీ సాహిత్యం విలసిల్లుతోంది. 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి పాకిస్తాన్, భారతదేశాల సింధీ సాహిత్యంలో గణనీయమైన భేదం కనిపిస్తూ వస్తోంది. పాకిస్తానీ సింధీ సాహిత్యంలోనూ, భాషలోనూ విస్తారంగా పర్షియన్, అరబిక్ పదజాల వినియోగం కనిపిస్తూండగా, భారతీయ సింధీ సాహిత్యంపై హిందీ ప్రభావం గాఢంగా ఉంది.[12]

విద్యాబోధన

[మార్చు]

మొఘల్ సామ్రాజ్య పతనం అనంతరం భారతదేశం బ్రిటీష్ పాలనలోకి వచ్చాకా సింధ్ ప్రాంతం మొదట్లో బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1935లో సింధ్ ప్రావిన్సును బొంబాయి నుంచి విడదీసి ఏర్పాటుచేశాకా విడిగా సింధ్ ఏర్పడింది. బొంబాయి ప్రెసిడెన్సీలో ఉన్నన్నాళ్ళూ సింధీలు ఎక్కువగా ఉన్న థార్ ఎడారి ప్రాంతమైన థార్‌పార్కర్‌లో గుజరాతీ భాషలో, మిగిలిన ప్రాంతాల్లో కొంతమేరకు సింధీలో బోధన జరిగేది. ప్రత్యేకంగా సింధ్ ప్రెసిడెన్సీ ఏర్పడ్డాకా విస్తారంగా సింధీలో విద్యాబోధన ప్రారంభమైంది. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు సింధ్ ప్రాంతం మొత్తంగా పాకిస్తాన్‌లో భాగమైంది. పాకిస్తాన్ భాషా విధానం ప్రకారం పాకిస్తాన్ వ్యాప్తంగా ఉర్దూ ఏకైక అధికార భాషగా మారడంతో సింధీ భాషలో విద్యాబోధన పోయి, ఉర్దూ మాధ్యమంలో బోధన ప్రారంభమైంది.[14] బంగ్లాదేశ్ ఉద్యమ ప్రభావంతో భాషా విధానం మారే కొద్దీ సింధీ భాషలో విద్యాబోధన కూడా పెరగజొచ్చింది.

పలువురు సింధీ హిందువులు, సింధీ సిక్ఖులు విభజన సమయంలో భారతదేశంలోకి వలస రావడం, రాజస్థాన్, గుజరాత్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో తొలినుంచీ సింధీయుల గణనీయమైన సంఖ్యలో ఉండడం కారణంగా భారతదేశం సింధీని అధికార భాష చేసింది. సింధీని భాషగా కానీ, బోధన మాధ్యమంగా కానీ ఎంచుకుని చదవవచ్చన్న అవకాశం భారతదేశం ఇచ్చింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సింధీ మూడవ భాషగా ఎంచుకుని చదివేందుకు వీలుంది.[15] రాజస్థాన్‌లో సింధీ భాషాభివృద్ధి కోసం రాజస్థాన్ సింధీ అకాడమీ కూడా ఏర్పాటయింది.

మాండలికాలు

[మార్చు]

సింధీ మాండలికాల్లో విచోలీ, లారీ, లాసీ, కథియావారీ కచీ, థారీ, మాకారియా, డక్స్లిను, ముస్లిం సింధీ ప్రధానమైనవి.[16] సింధీ భాష ప్రామాణిక మాండలికం విచోలీ సింధీ. ఈ మాండలికం ప్రధానంగా మధ్య సింధ్ ప్రాంతానికి చెందినది. సింధీ రచనలు, సాహిత్యంపై విచోలీ సింధీ ప్రభావం అధికం. థార్ ఎడారి ప్రాంతంలో మాట్లాడే మాండలికాన్ని థారీ మాండలికం అంటారు.[17] ఉత్తర సింధీలో సిరైకీ మాండలికం మాట్లాడతారు[18] ఈ మాండలికానికి, దక్షిణ పంజాబ్‌కు చెందిన సరైకీ భాషకీ సంబంధాలున్నాయి. ఈ మాండలికాన్ని కొందరు సింధీ భాష మాండలికమనీ, మరికొందరు పండితులు సరైకీ భాష మాండలికమనీ భావిస్తూంటారు.[19]

రాత పద్ధతులు

[మార్చు]

8వ శతాబ్దిలోనే సింధీ మహాభారతం రాతలో ఉందని పేర్కొంటూంటారు. అయితే 15వ శతాబ్ది నాటికే సింధీ రాత ప్రతులకు సంబంధించిన వివరాలు దొరుకుతున్నాయి.[12]

సింధీ లిపి ప్రామాణికీకరణ పొందేలోగానే వాణిజ్యానికి సింధీ భాషను దేవనాగరి, లండా భాషల్లో ఉపయోగించడం కనిపిస్తుంది. సాహిత్య, మతపరమైన రచనల కోసం అబ్-ఉల్-హసన్ సింధీ అన్న అరబిక్-పర్షియన్ శైలి లిపి, గురుముఖి లిపి వాడడం కనిపిస్తుంది. [20][21] 19వ శతాబ్ది చివరి భాగంలో బ్రిటీష్ పరిపాలనా కాలంలో దేవనాగరి లిపి, తత్సంబంధిత లిపులకు బదులు పర్షియన్ లిపిలో రాయడాన్ని అధికారికంగా ప్రామాణీకరించారు.[22]

మూలాలు, ఆధారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Script". Sindhilanguage.com.
  2. Gulshan Majeed. "Ethnicity and Ethnic Conflict in Pakistan" (PDF). Journal of Political Studies. Retrieved December 27, 2013.
  3. "Sindhi". The Languages Gulper. Retrieved December 27, 2013.
  4. "Encyclopædia Britannica". Sindhi Language. Retrieved December 29, 2013.
  5. Laurie Bauer, 2007, The Linguistics Student’s Handbook, Edinburgh
  6. Gulshan Majeed. "Ethnicity and Ethnic Conflict in Pakistan" (PDF). Journal of Political Studies. Retrieved December 27, 2013.
  7. "Sindhi". The Languages Gulper. Retrieved December 27, 2013.
  8. "Encyclopædia Britannica". Sindhi Language. Retrieved December 29, 2013.
  9. "Languages Included in the Eighth Schedule of the Indian Constution | Department of Official Language | Ministry of Home Affairs | GoI". www.rajbhasha.nic.in. Archived from the original on 2018-05-12. Retrieved 2018-04-09.
  10. "Sindhi Language, Sindhi Dialects, Sindhi Vocabulary, Sindhi Literature, Sindhi, Language, History of Sindhi language". www.indianmirror.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-04-09.
  11. "English to Sindhi Dictionary & Sindhi to English Dictionary". KhandBhale.org. Archived from the original on 16 ఆగస్టు 2015. Retrieved 24 August 2015.
  12. 12.0 12.1 12.2 "Encyclopædia Britannica". Retrieved May 11, 2013.
  13. "Sindhi - About World Languages".
  14. భవ్‌నానీ 1987, p. 137.
  15. [nclm.nic.in/shared/linkimages/NCLM47thReport.pdf National Committee for Linguistic Minorities]
  16. మూస:E19
  17. భవ్‌నానీ 1987, p. 138.
  18. Masica, Colin P. (1991). The Indo-Aryan languages. Cambridge language surveys. Cambridge University Press. p. 443. ISBN 978-0-521-23420-7.
  19. Rahman, Tariq (1995). "The Siraiki Movement in Pakistan". Language Problems & Language Planning. 19 (1): 3. doi:10.1075/lplp.19.1.01rah.
  20. Khubchandani (2003:633)
  21. "Ancient Scripts: Landa".
  22. Cole (2001:648)

ఆధార గ్రంథాలు

[మార్చు]