Jump to content

స్టెయిన్ లెస్ స్టీల్

వికీపీడియా నుండి

పూర్వ కాలంలో వంటింటి సామానులు కేవలం మట్టి పాత్రలే. కాలానుగుణంగా వాటి స్థానంలో, ఇనుప వస్తువులు, రాగి, ఇత్తడి వస్తువువులు వచ్చి మట్టి పాత్రల స్థానాన్ని ఆక్రమించాయి. కాని ఈ లోహపాత్రలు త్వరిత గతిన తృప్పు పట్టి పాడైపోవడముతో అదో పెద్ద సమస్యగా మారినది. అంతేగాక వంటలలో ఉపయోగించే చింత పండు వంటి పులుసు పదార్థలతో ఆ పాత్రలలో వండిన ఆహార పదార్థాల రుచిలో తేడా వచ్చేది. ఒక్కొసారి విష తుల్యమైయ్యేవి. వాటికి విరుగుడుగా అల్యూమినియం అనే లోహం వంట పాత్రల తయారీలో ప్రవేశించింది. ఈ పాత్రలు తేలికగాను, చౌకగాను, తృప్పు పట్టనివిగానుండుట వలన చాల కాలము అవే రాజ్యమేలాయి. ఆ తర్వాత స్టెయిన్ లెస్ స్టీల్ ఆ రంగంలో ప్రవేశించి ఉన్నత స్థానాన్ని అక్రమించి రాజ్య మేలుతున్నది.

ఆవిర్భావం

[మార్చు]

లోహ వస్తువులు తృప్పు పట్టి త్వరగా పాడైపోతుండడముతో, దానికి విరుగుడుగా 1913 లో బ్రిటన్ కు చెందిన హ్యారీ బ్రియర్లీ స్టెయిన్ లెస్ స్టీల్ ను కనుగొన్నాడు. ఇనుము లేదా ఉక్కుకు విభిన్న లోహాలను భిన్న పాళ్ళలో జోడిస్తూ తృప్పు పట్టని లోహ మిశ్రమాన్ని తయారుచేయాలని పరి శోధనలు చేశారు. ఆ క్రమంలో 'క్రోమియం పాళ్ళు ఎక్కువ వున్న లోహ మిశ్రమాలు త్వరగా తృప్పు పట్టవని ముందుగా తెలుసుకున్నాడు హ్యారి. అందుకే దీనిని వంట సామానులకు వాడకానికి పేటెంట్ హక్కుని పొండాడు.

వంటింటిలో వాడకం

[మార్చు]

స్టీలు పాత్రలు త్రుప్పుపట్టక పోవడం, చింత పండు వంటి పులుసు పదార్థల వల్ల వంటలో రుచి మారక పోవడము, చాల అందంగా వుండడము, తేలికగా వుండము, అత్యంత గట్టిగా వుండటము, అతి పల్చని రేకులుగా తయారు చేయగల అవకాశముండడంతోను, వాడిన తర్వాత శుభ్ర పరచడము అతి సులబము కావడముతో ఎంత కాలమైనా వాటి మెరుపు తగ్గక పోవడంతో ఈ స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారత దేశంలో వీటి ఉపయోగము విపరీతంగా పెరిగి పోయింది. మిగతా లోహాలను తోసి రాజని ప్రధమ స్థానంలో కూర్చున్నది. ఒకప్పుడు స్టెయిన్ లెస్ స్టీలు గ్లాసులో కాపీ త్రాగడం అంటే అదొక హుందా తనానికి ప్రతీక గా వుండేది. అటువంటిది అనేక రూపాలు సంతరించుకొని అతి సామాన్యునికి కూడ అందు బాటులోని వచ్చినది స్టెయిన్ లెస్స్ స్టీల్.

ఇతరత్రా ఉపయోగాలు

[మార్చు]

ప్రస్తుతం స్టెయిన్ లెస్స్ స్టీలు కేపలం వంట పాత్రలకే కాక అనేక విధానలుగా ఉపయోగంలో వున్నది. యంత్రాలలోను, వాహనాలలోను, అలంకరణ వస్తువులలోను, పూజా సామాగ్రి లోను, గృహాలంకరణలోను, , వంటింటి సింకులకు, అల్మారాలకు, ఇలా అనేక విధాలుగా ఈ స్టెయిన్ లెస్ స్టీలును ఉపయోగిస్తున్నారు. స్టెయిన్ లెస్ స్టీలు ఉపయోగము లేని రంగ మంటు ఏదీ లేదు. అలంకరణ వస్తువులైన వాచీలలో ఇది ఏనాడో ప్రవేశించింది. అంతేకాక స్త్రీల అలంకారమైన నగల రూపంలో కూడ ఇది ప్రవేశించింది.

వైద్య రంగంలో ఉపయోగం

[మార్చు]

వాతావరణ పరిస్తితులకు పాడవని లక్షణము గల్ స్టెయిన్ లెస్స్ పరికరాలు వైద్య విభాగములో ఎక్కువగా ఉపయోగములో వున్నవి. ఆరోగ్య పరిరక్షణకు ఇదెంతో ముఖ్యము.

ఎన్నో రకాలు

[మార్చు]

ఇనుము, ముడి ఇనుము, కార్బన్ స్టీల్, ఇలా లోహాలలో అనేక రకాలున్నట్లే స్టెయిన్ లెస్ స్టీలో కూడ అనేక రకాలున్నాయి. ఆవిధంగా స్టెయిన్ లెస్ స్టీల్ లో 150 రకాలున్నాయి. కాని వాటిలో ఎక్కువగా ఉపయోగములో వున్నవి మాత్రము 15 రకాలె.

రంగు రంగుల స్టెయిన్ లెస్ స్టీల్

[మార్చు]

అతి తక్కువ నీలి రంగులో వుండే స్టెయిన్ లెస్ స్టీల్ ఇప్పుడు అనేక రంగులలోకూడ కను విందు చేస్తున్నది. వాటికి రంగు లద్దడంతో కాకుండా... క్రోమియం, సల్ల్ప్యూరిక వంటి ఆమ్ల పూరిత ద్రావణాలలో ముంచి వాటిని బంగారు, రాగి, వెండి, గులాబి, ఇలా పలు రంగుల్లో స్టెయిన్ లేస్ పరికరాలు వస్తున్నాయి. రంగుతోపాటు వాటికున్న మెరుపు కూడా వాటి అందాన్ని ఇనుమడింప చేస్తున్నవి.

మూల: ఈనాడు. ఆదివారం: 22/12/2013